హైదరాబాద్: తెలంగాణలో గత ఏడాది కాలం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్రీడీ వ్యూహాంతో ముందుకు వెళ్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KT Rama Rao) విమర్శించారు. త్రీడీ(3D) వ్యూహం అంటే.. విధ్వంసం(డిస్ట్రక్షన్), దారిమళ్లింపు(డైవర్షన్), దృష్టిమళ్లించడం(డిస్ట్రాక్షన్) అని ఆయన పేర్కొన్నారు. ఈ ఐడియాలజీతోనే రేవంత్ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి తెగించిందన్నారు. ఆ నెపంతోనే తమపై కేసులు పెట్టినట్లు కేటీఆర్ ఆరోపించారు. కానీ ఏ ఒక్క కేసులోనే పస లేదన్నారు. అన్ని ఉత్తుత్తి కేసులు పెట్టి, న్యాయాన్ని అపహాస్యం చేస్తున్నట్లు విమర్శించారు.
కోర్టులో అన్ని కేసులను ఎదుర్కొంటున్నామని, ఫార్ములా-ఇ కేసును కూడా కోర్టులో ఎదుర్కొంటున్నట్లు కేటీఆర్ చెప్పారు. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. మేం ఎటువంటి ముడుపులు ఇవ్వలేదన్నారు. ఎటువంటి తప్పు చేయలేదని, దీంట్లో ఎటువంటి అవినీతి లేదన్నారు. ఫార్ములా-ఈ రేసును నిర్వహించి.. హైదరాబాద్ నగరాన్ని విశ్వవిఖ్యాతం చేయాలని భావించినట్లు చెప్పారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ ఈ విషయాన్ని తెలిపారు.
#WATCH | Hyderabad | BRS Working President KT Rama Rao says, “In the last year, Revanth Reddy government in Telangana has indulged in a 3D strategy of destruction, diversion and distraction. As a part of this ideology, they have gone on a political witchhunt and vendetta and… pic.twitter.com/QEfTp1qxkp
— ANI (@ANI) December 30, 2024
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో పాసైన తీర్మానం గురించి కేటీఆర్ స్పందించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఓ గొప్ప ఆర్థికవేత్త అని, అన్ని పార్టీలు ఆయన్ను గౌరవిస్తాయన్నారు. ఇవాళ అసెంబ్లీలో పాసైన తీర్మానానికి తమ పార్టీ మద్దతు ఇచ్చిందన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ స్థూపాన్ని ఇక్కడ పెట్టాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు చెందిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు .. దేశ రాజధాని ఢిల్లీలో స్మారకం నిర్మించే విధంగా కేంద్రంపై వత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కేటీఆర్ తెలిపారు.
#WATCH | Hyderabad | On Telangana Assembly passing resolution seeking Bharat Ratna for late former PM Dr Manmohan Singh, BRS leader KT Rama Rao says, “Dr Manmohan Singh was a great economist. He is someone who is respected across party lines. Our party supported the resolution… pic.twitter.com/yQDOkY5zDY
— ANI (@ANI) December 30, 2024