KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో గత 11 నెలలుగా అరాచక పాలన సాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాటింది. ఢిల్లీ వాళ్లకు ఎప్పుడు కోసం వస్తే అప్పుడు ఆయన పదవి ఊడిపోతుందని కేటీఆర్ సెటైర్లు వేశారు. జూబ్లీహిల్స్‌లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ కలిసి ధైర్యంగా ఉండాలని చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ వాళ్ల బెదిరింపులకు భయపడాల్సి అవసరం లేదు. కొడంగల్‌కు సెక్యూరిటీ లేకుండా వస్తే ప్రజలు తంతారని సీఎంకు భయం పట్టుకుంది. సొంత నియోజకవర్గలో కూడా తిరగలేని పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డిలే ప్రజలకి భయపడాలే. ఈ కష్టాలు, ఇబ్బందులు కొన్ని రోజులు మాత్రమే. పదవి శాశ్వతం అనుకోని రేవంత్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాలకు మనమే అడ్డుకట్ట వేయాలని కేటీఆర్ అన్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన రైతులకు అండగా ఉంటాం. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తాం. వారికి భరోసాగా ఉంటాం. డీజీపీ, పోలీసులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ప్రభుత్వం చెప్పినట్లు ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు. చట్ట ప్రకారం రూల్స్‌కు అనుగుణంగా పనిచేయండి. కలెక్టరేమో దాడి జరగలేదంటారు. పోలీసులు, ప్రభుత్వం మాత్రం దాడి జరిగిందంటారు. ఈ ప్రభుత్వానికే స్పష్టత లేదు. డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ కూడా అయిన కలెక్టర్ మాట్లాడిన దానికి భిన్నంగా కాంగ్రెస్ నాయకులు, పోలీసులు మాట్లాడుతున్నారు. మీడియా కూడా పీడితుల బాధలను చూపించాలి. పీడితుల వైపు ఉండాలని కేటీఆర్ కోరారు.
ఇవి కూడా చదవండి..
KTR | రేవంత్ రెడ్డి భూదాహా యజ్ఞంలో అధికారులు బలిపశువులు కావొద్దు : కేటీఆర్
KTR | పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారు : కేటీఆర్
Harish Rao | ముఖ్యమంత్రికి ఈ మధ్య మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైంది : హరీశ్‌రావు