KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి భూదాహా యజ్ఞంలో అతి వేషాలు వేసి అధికారులు బలిపశువులు కావొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అతి చేస్తే పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో అదే జరుగుతుందని కేటీఆర్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ కలిసి ధైర్యంగా ఉండాలని చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఏ కారణం చేత మీరు మహబూబ్ నగర్ ఎంపీని లగచర్ల వెళ్లకుండా అడ్డుకున్నారు. రేపు మేము కూడా వెళ్తాం మమ్మల్ని కూడా అడ్డుకుంటారా? 144 సెక్షన్ ఉన్న సరే 300 మందితో తిరుపతి రెడ్డి లగచర్ల గ్రామంలోకి వెళ్లేందుకు ఎందుకు అనుమతించారని డీజీపీని ప్రశ్నిస్తున్నా? అని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి అల్లుడి కోసం ఫార్మా కంపెనీ పేరిట పేదల భూములు గుంజుకోవటానికి చేస్తున్న ప్రవసనంలో మీరు బలి కాకండి. పట్నం నరేందర్ రెడ్డి గారి కుటుంబానికి పార్టీ మొత్తం అండగా ఉంటుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నరేందర్ రెడ్డి కుటుంబానికి భరోసా కల్పించేందుకే వచ్చాం. ఒక్క నరేందర్ రెడ్డి మాత్రమే కాదు. పేద రైతులు ఎవరినైతే అరెస్ట్ చేశారో వారందరికీ కూడా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. పార్టీ నేతలమంతా లగచర్లకు వెళ్లి వారికి భరోసా ఇస్తాం. మేము వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారో చూస్తాం. రాష్ట్రంలో పోలీసులు ఎందుకు సెలెక్టివ్ రూల్స్ పాటిస్తున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అరెస్ట్ చేసిన రైతులను పోలీసులు చిత్ర హింసలు పెట్టి తీవ్రంగా కొట్టారు. వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. రైతులను కొట్టిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం ఇప్పుడు కూడా నోరు విప్పకపోతే చరిత్ర హీనులం అవుతాం. బీజేపీ, కమ్యూనిస్ట్ సహా అన్ని పార్టీలు స్పందించాలి. లేదంటే ప్రజాస్వామిక తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా పోతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారు : కేటీఆర్
Harish Rao | ముఖ్యమంత్రికి ఈ మధ్య మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైంది : హరీశ్‌రావు
Patnam Narendar Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్..