Patnam Narendar Reddy | బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. లగచర్ల ఘటనలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 27 వరకు ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండనున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. లగచర్లలో సోమవారంపై వికారాబాద్ కలెక్టర్‌పై దాడిలో ఆయన మాజీ ఎమ్మెల్యే కుట్ర ఉందన్న ఆరోపణలతో పోలీసులు.. ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం కలెక్టర్ సహా పలువురు అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.
అయితే, అరెస్టును మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఖండించారు. సీఎం రేవంత్ అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. కొడంగల్‌లో రైతుల తిరుగుబాటుతో రేవంత్‌రెడ్డి ఖంగుతిన్నారని.. ఆ డ్యామేజ్‌ని కంట్రోల్ కోసమే లగచర్ల ఘటనను బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారంటూ ఆయన ఆరోపించారు. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అన్న ఆయన.. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడమే ప్రభుత్వ పనిగా మారిందంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం బాధ్యత మరిస్తే ప్రతిపక్షం ప్రశ్నిస్తూనే ఉంటుందని.. అందులో తప్పేముందని నిలదీశారు. ఇక ఆయన అరెస్ట్‌పై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.