KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్ చదివిన పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉండాలనే ఉద్దేశంతో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ కంపెనీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికే ఐటీ కంపెనీలను పరిమితం చేయకుండా.. ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించింది. అలా వేల మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ కంపెనీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటైన ఐటీ హబ్‌లకు రేవంత్ సర్కార్ కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. అసలు ఆ హబ్‌లను పట్టించుకోవడం లేదు. దీంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేటలోని ఐటీ హబ్‌కు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నెట్ ప్రొవైడర్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు.. ఉన్న కంపెనీలు పోకుండా చూడండి! అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగరం ఒక్కటే కాకుండా తెలంగాణలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో సుమారు ఎనిమిది ఐటీ హబ్‌లను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. కానీ, కాంగ్రెస్ రాగానే మంచిగా నడుస్తున్న ఆ ఐటీ హబ్‌లు ఒక్కొక్కటిగా పట్టాలు తప్పుతున్నాయి. విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులు కూడా కట్టని దుస్థితికి చేరుకున్నాయి. ఫలితంగా కంపెనీలు మూతపడుతున్నాయి. గత ప్రభుత్వం మీద కోపంతో ఇలాంటి దుశ్చర్యలు మానండి. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే సదుద్దేశంతో నెలకొల్పిన ఈ ఐటీ హబ్‌లను సక్రమంగా నడపాలని కోరుతున్నాను అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.
కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు, ఉన్న కంపెనీలు పోకుండా చూడండి!
హైదరాబాద్ నగరం ఒక్కటే కాకుండా తెలంగాణలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో సుమారు ఎనిమిది ఐటీ హబ్‌లను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
కానీ, కాంగ్రెస్ రాగానే మంచిగా నడుస్తున్న… pic.twitter.com/V5RnfJ7aL6
— KTR (@KTRBRS) January 24, 2025
ఇవి కూడా చదవండి..
Manne Krishank | సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ బోగస్.. మండిపడ్డ మన్నె క్రిశాంక్
Harish Rao | గ్రామ సభల్లో మర్లబడుతున్న తెలంగాణ.. ప్రభుత్వ ఫెయిల్యూర్‌కు ఇదే నిదర్శనం : హరీశ్‌రావు