Padma Rao | పజ్జన్న.. ఈ పేరు అందరికీ సుపరిచితమే.. అటు బీఆర్ఎస్ పార్టీలో.. ఇటు సికింద్రాబాద్ నియోజకవర్గంలో. పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పజ్జన్నకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. తన నియోజకవర్గంలో ఉండే పేద ప్రజల సమస్యలు వింటూ పరిష్కరించుకుంటూ.. అందరితో కలిసిమెలిసి ఉండే కార్య సాధకుడు పజ్జన్న. అందుకే ఆయనను స్థానికంగా దేవుడిలా ఆరాధిస్తారు.
పజ్జన్న బాటలోనే ఆయన కుమారులు, మనువండ్లు కూడా పయనిస్తున్నారు. అయితే పజ్జన్న మనువడు పొలిటికల్ డైలాగ్స్‌తో రెచ్చిపోయాడు. తన తాతను కీర్తిస్తూనే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జై కొట్టాడు. కారు గుర్తుకే మన ఓటు అంటూ గులాబీ శ్రేణులను ఉత్తేజపరిచాడు. అంతటితో ఆగిపోలేదు.. ఓటమికి ఓడించే సత్తా ఉంటే.. ఓపికకు గెలిపించే సత్తా ఉంది.. ఓపికతో ఉంటే రానున్న రోజుల్లో విజయం మనదే.. అధికారం మనదే.. అని పజ్జన్న మనువడు చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఇటీవల డెహ్రాడూన్ పర్యటనకు వెళ్లారు. పర్యటనలో ఉండగానే గుండెపోటుకు గురైన ఆయనకు అక్కడే స్టంట్ వేయించారు కుటుంబ సభ్యులు. అనంతరం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇక పద్మారావును పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు పలువురు ఆయన నివాసానికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ వచ్చిన సందర్భంగా.. పద్మారావు మనువడు పై డైలాగ్స్ చెప్పి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పజ్జన్న మనువడిని గులాబీ శ్రేణులు చప్పట్లతో అభినందించారు.
ఓటమికి ఓడించే సత్తా ఉంటే…
ఓపికకు గెలిపించే సత్తా ఉంది…
ఓపికతో ఉంటే రానున్న రోజుల్లో విజయం మనదే… అధికారం మనదే…@TPadmaRao @KCRBRSPresident @ShilpaT16 pic.twitter.com/XLeCvzKsyP— Tirumandas Naresh Goud (@GoudNareshBrs) January 23, 2025
ఇవి కూడా చదవండి..
Harish Rao | గ్రామ సభల్లో మర్లబడుతున్న తెలంగాణ.. ప్రభుత్వ ఫెయిల్యూర్‌కు ఇదే నిదర్శనం : హరీశ్‌రావు
Vinod Kumar | యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి..! రేవంత్ రెడ్డికి వినోద్ కుమార్ డిమాండ్
KTR | ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణలు చెప్తావా!? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్