KTR | హైదరాబాద్ : లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయం.. తెలంగాణ ప్రజల విజయం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంట్లో మన గళం వినిపించే నాథుడే లేడు. తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే. ఇంకెవరూ కాదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రసంగించారు.
లగచర్ల భూముల సేకరణ విరమణ గిరిజనులు, దళితులు, బీసీల, రైతుల విజయం కూడా అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రియల్ ఎస్టేట్ బేహారీకి, పాలన తెలియదు. మీ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేయటం మాత్రమే తెలుసు. మరొక రూపంలో మీ భూములు కావాలంటూ మళ్లీ వస్తాడు. జాగ్రత్తగా ఉండాలే. ఈ ప్రభుత్వంపై ప్రతిఘటన మాత్రమే మనకు ఉన్న గత్యంతరం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అయ్యింది. మైనార్టీ సోదరులు కూడా మనవాళ్లు ఎవరో.. కానివాళ్లు ఎవరో గుర్తించాలి. బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసి ప్రయోజనం పొందారు. కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | గుజరాతీ గులాంలు.. ఢిల్లీ కీలుబొమ్మలతో తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం : కేటీఆర్
KTR | తెలంగాణ జాతి వ్యథను రేపటి తరానికి నరనరాన ఎక్కించాలి : కేటీఆర్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వానిది లేకి బుద్ధి.. నిప్పులు చెరిగిన కేటీఆర్