హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : హైకోర్టు బార్ అసోసియేషన్ సీనియర్ కార్యవర ్గసభ్యుడిగా నాగులూరి కృష్ణకుమార్గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికలను ఈ నెల 26న నిర్వహిస్తారు.
ఇందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ గురువారం సాయంత్రం 4.30 గంటలతో ముగిసింది. సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా అంటే 25 ఏండ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్న విభాగంలో కృష్ణకుమార్గౌడ్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.