KTR | హైదరాబాద్ : తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లేకి బుద్ధితో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రసంగించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేకి బుద్దితో వ్యవహరిస్తోంది.. బంజారా ఆడబిడ్డలు తమ వేషధారణలో సంప్రదాయంగా దీక్షా దివస్‌లో పాల్గొనడానికి వస్తుంటే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇక్కడి వరకు వీధి దీపాలు ఆర్పేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేశారు. ఈ ప్రభుత్వానిది లేకి బుద్ధి అని అర్థమవుతోంది. కాంగ్రెస్ తన చిల్లర బుద్ధిని రుజువు చేసుకుంది. మనం ఎవర్నో తిట్టడానికి విమర్శించడానికి ఈ కార్యక్రమం పెట్టుకోలేదు అని కేటీఆర్ తెలిపారు.
నిన్న ఏదారిలో నడిచి వచ్చామో తెలుసుకోకపోతే రేపు ఏ బాటలో నడవాలో అర్థం కాదు. కాబట్టి చరిత్రలను అర్థం చేసుకోకుండా భవిష్యత్‌ను నిర్మించలేం. గతం తెలుసుకోకుండా గమ్యాన్ని చేరుకోలేం. ఈ తరం పిల్లలకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, కేసీఆర్ భూమిక తెలియజేప్పే బాధ్యత మనందరిది. ఇప్పటి తరానికి తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలియొచ్చు. కానీ పోరాటాలు, త్యాగాల చరిత్ర, విద్యార్థి అమరవీరుల త్యాగం కూడా తెలియాలని కేటీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
RS Praveen Kumar | మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్
KTR | కేసీఆర్ గురించి ఆసక్తికర విషయాలు.. దీక్షా దివస్‌లో కేటీఆర్ వెల్లడి