KTR | కరీంనగర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి దీక్షా దివస్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర విషయాలు తెలిపారు. దీక్షా దివాస్ సందర్భంగా కరీంనగర్లోని అల్గునూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
అప్పట్లో కెప్టెన్ లక్ష్మీకాంతారావు.. కేసీఆర్ ఏది చెబితే దానికి ఎస్ అనే వారు. అలా ఎందుకు అంటున్నారని నేను ఒకసారి అడిగితే చాలా ఆసక్తికర విషయం చెప్పారు. 2001లోనే కేసీఆర్ తెలంగాణ వస్తదని గట్టి చెప్పేవారు. జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్రమంత్రులు మన వాళ్లు అవుతారని అనేవారని ఆయన నాతో చెప్పారు. ఓట్ల ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన చెబితే ఆయన చెప్పిందంత సినిమా లాగా ఉందని అన్నానని అన్నారు. అయితే కరీంనగర్లో జరిగే సింహా గర్జనకు రెండు లక్షల మంది రాకపోతే మీరు నాతో ఉద్యమంలో ఉండవద్దని కేసీఆర్ అన్నారని చెప్పారు. ఆ రోజు సభకు మేము 5 గంటలు ఆలస్యంగా వెళ్లినా సరే రెండున్నర లక్షల మంది సభకు వచ్చారని చెప్పారు. ఆనాటి నుంచి కేసీఆర్ ఏది చెప్పినా ఆయన మాటకు ఎదురు చెప్పలేదని ఆయన అన్నారని కేటీఆర్ తెలిపారు.
2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష ఉద్యమ పతాక సన్నివేశంగా మారింది. ఆ తర్వాత ఐదేళ్ల పాటు తెలంగాణ కోసం కేసీఆర్ వివిధ రూపాల్లో పోరాటం చేశారు. ఉప ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి తెలంగాణ ఆకాంక్షను చాటి చెప్పారు. ఆనాటి చరిత్ర ఇవ్వాళ్టి 18, 20 ఏళ్ల పిల్లలకు తెలియదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా చాలా మంచి పనులు చేసిండని మాత్రమే తెలుసు. కానీ కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిండని వారికి తెలియాలి. ఆనాటి కేసీఆర్ స్ఫూర్తితో మళ్లీ తెలంగాణలో మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రజలను మోసం చేస్తూ వికృతంగా వికట్టహాసం చేస్తోంది. కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా మళ్లీ ఒకసారి సంకల్పం తీసుకొని కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకూ మనం పోరాటం చేయాల్సి ఉంది. రాబోయే నాలుగేళ్లు ప్రజల కోసం పోరాటం చేద్దాం. ప్రతి వేదికలో తెలంగాణ పక్షాన పోరాడుదాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
KCR | నేడు దీక్ష దివస్.. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు.. ఫొటో గ్యాలరీ
KTR | కేసీఆర్ అంటే ఒక పేరు కాదు.. కేసీఆర్ అంటే ఒక పోరు : కేటీఆర్