KTR | హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ లేపేసి కొత్త అసెంబ్లీ భవనం కడితే బావుంటుంది.. సచివాలయం, అసెంబ్లీ పక్క పక్కనే ఉంటే బాగుంటుంది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.
చరిత్ర విలువ తెలియదు.. మహోన్నతులను గౌరవించడం చేతకాదు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన ఎన్టీఆర్ మీదనా మీ పిల్లికూతలు..? పేదల ఇళ్లు కూల్చినా ఇంకా మీ ఆకలి తీరలేదా..? మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా..? అని నిలదీశారు.
కూల్చడం! మార్చడం! ఆనవాళ్లు చెరిపేయడం! ఇదేగా మీకు చేతనైనది!! ఇది నిర్మాణాత్మక ప్రభుత్వం కానే కాదు.. విధ్వంసకారుడి వికృత ఆలోచనలకు ప్రతిరూపం! అని కేటీఆర్ మండిపడ్డారు.
చరిత్ర విలువ తెలియదు
మహోన్నతులను గౌరవించడం చేతకాదు!తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన NTR మీదనా మీ పిల్లికూతలు?
పేదల ఇళ్లు కూల్చినా ఇంకా మీ ఆకలి తీరలేదా?
మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా?కూల్చడం!
మార్చడం!
ఆనవాళ్లు చెరిపేయడం!
ఇదేగా మీకు చేతనైనది!!ఇది నిర్మాణాత్మక…
— KTR (@KTRBRS) December 19, 2024
ఇవి కూడా చదవండి..
BRS | భూభారతి చట్టం ప్రకటనలపై.. బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు