హైదరాబాద్: ప్రభుత్వంలో కొండచిలువలు పాగా వేస్తే, కళాశాలలో కట్లపాములు కాటేయవా అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి తయారైందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar ) అన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పాము కాట్లపై ఎక్స్ వేదికగా స్పందించారు. అసెంబ్లీలో మంత్రి సీతక్క సలహాలు ఇవ్వొచ్చని అన్నారని, కాబట్టి తాను కొన్ని సూచనలు చేస్తున్నానని వెల్లడించారు.
అవి..
1. ప్రతి రోజూ ఒక మంత్రి పెద్దాపూర్ గురుకులంలో పిల్లల డార్మిటరీలో పడుకోవాలి (ప్రిన్సిపల్ రూంలో కాదు).
2. సచివాలయాన్ని పెద్దాపూర్ గురుకులంకు తరలించవచ్చు.
3. ప్రతి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఒక స్నేక్ క్యాచర్ (Snake Catcher) పోస్టును కేటాయించి వారిని టీజీపీయస్సీ ద్వారా రిక్రూట్ చేసుకోవచ్చు. ఆ పరీక్షలో ప్రశ్నలు మాత్రం తెలంగాణ పాముల గురించే అడగాలి, గ్రూప్-2లో లాగా పక్క రాష్ట్రాల పాముల గురించి కాదు.
4. పెద్దాపూర్ గురుకులాన్ని విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి మార్చి ఇప్పుడున్న గురుకులాన్ని సరీసృప నిలయంగా (Reptile Park) మార్చవచ్చు.
5. మాకు పిల్లల ప్రాణాలు రక్షించడం చేతకాదు, కేవలం అక్రమ కేసులు పెట్టడమే వచ్చు మహాప్రభో అని మీరందరూ సామూహిక రాజీనామా చేయవచ్చు. మా చావు మేము చస్తాం.
లేకపోతే.. మీ ఇళ్లలోకి పాములు రావు కాని మా పిల్లల బడుల్లోకి ఎట్ల వచ్చి మళ్లీ మళ్లీ కాటేస్తున్నాయి??. పుస్తకాలలో పాఠాలు నేర్చుకోవాలా? పాములు పట్టడం నేర్చుకోవాలా? కాంగీ దయ్యాలు?.. అంటూ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు.
ప్రభుత్వంలో కొండచిలువలు పాగా వేస్తే,
కళాశాలలో కట్లపాములు కాటేయవా అన్నట్టుంది పరిస్థితి!Anyway,
నిన్న అసెంబ్లీ లో మంత్రి
సీతక్కగారు సలహాలు ఇవ్వండి అన్నారు కాబట్టి…1. ప్రతి రోజూ ఒక మంత్రి పెద్దాపూర్ గురుకులంలో పిల్లల డార్మిటరీలో పడుకోవాలి. (ప్రిన్సిపల్ రూంలో కాదు)
లేదా..… https://t.co/RIOa0aB6XQ
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 19, 2024