KTR | హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ వెంట పట్నం నరేందర్ రెడ్డి భార్య, శ్రీనివాస్ గౌడ్, మహముద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు.
ఇక లగచర్లలో అధికారుల కార్యక్రమంలో రైతులు దాడి చేశారంటూ బొంరాస్పేట పోలీసులు మూడు ఎఫ్ఐఆర్లను ఎందుకు నమోదు చేశారో పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఒక నేరానికి సంబంధించి మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి తరపున ఆయన భార్య శృతి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | గ్యారెంటీలకు పడిపోని ‘మరాఠీలు’.. రేవంత్ రెడ్డికి చెంపపెట్టు సమాధానం..
Sanjay Raut | ఇది ప్రజా తీర్పుకాదు.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు