Revanth Reddy | హైదరాబాద్ : మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. మహావికాస్ అఘాడీ డబుల్ డిజిట్‌కు మాత్రమే పరితమైంది. కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ ఎంవీఏలో భాగమైన కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసింది. కానీ 22 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది. పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే సమయానికి ఈ సంఖ్య కాస్త తగ్గొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది. సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించిన చంద్రాపూర్, భోకార్, నాయగావ్, నాందేడ్ నార్త్, షోలాపూర్ సిటీ నార్త్, షోలాపూర్ సౌత్‌లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అబద్దాలని మహారాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. రెడ్ బుక్ పట్టుకొని ప్రచారం చేసిన రాహుల్‌ను కూడా మరాఠీలు పట్టించుకోలేదు. రాహుల్, రేవంత్ ప్రచార హామీలను మహారాష్ట్ర ప్రజలు విశ్వసించలేదు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారెంటీలను స్థానికులు అసలు పట్టించుకోలేదని అర్థమవుతుంది. అందుకు ఈ ఫలితాలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | గ్యారెంటీలకు పడిపోని ‘మరాఠీలు’.. రేవంత్ రెడ్డికి చెంపపెట్టు సమాధానం..
Oreshnik Missile: ఓరష్నిక్ మిస్సైల్ ప్రయోగించిన రష్యా.. ఆ కొత్త క్షిపణి ప్రత్యేకతలు ఇవే
Jharkhand | బీజేపీ ఆశలు గల్లంతు.. జార్ఖండ్ పీఠం హేమంత్‌దే