KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని కోర్టులో రికార్డు చేస్తున్నారు. కేటీఆర్ వెంట న్యాయవాదులు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, బాల్క సుమన్‌తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
మేజిస్ట్రేట్ శ్రీదేవి ఆదేశాల మేరకు ఫిర్యాదుదారుడైన కేటీఆర్‌తోపాటు సాక్షులుగా ఉన్న తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్ వాం గ్మూలాలను సైతం కోర్టు రికార్డు చేయనుంది. మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరై తన మీద దాఖలైన ఆరోపణల గురించి వివరణ ఇచ్చేందుకు అవకాశాన్ని కల్పిస్తూ కోర్టు నోటీసుల్ని జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
KTR | హోం మంత్రిని నియమించండి.. శాంతి భద్రతలు కాపాడండి.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచన
KTR | అన్ని రంగాల్లో వైఫల్యం.. అన్ని వర్గాల్లో ఆగ్రహం..! కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్