KTR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు తెలంగాణ పాలిట దండుపాళ్యం ముఠాలా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. న్యాయవాది భూములకే సీఎం సోదరులు ఎసరు పెట్టినట్లు వార్తలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. బాధిత వ్యక్తి న్యాయం కోసం పోలీసుల వద్దకు వెళ్తే.. సీఎం సోదరులతో సెటిల్ చేసుకోమని చెబుతారా..? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉన్నది పోలీసులా? రేవంత్ ప్రైవేట్ సైన్యమా? న్యాయవాదికే న్యాయం దక్కకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్రంలో ఉన్న సోదరులకు తెలంగాణ ఆస్తులను దోచి పెడుతూ.. మరోవైపు అమెరికాలో తమ్ముడి కంపెనీతో 1000 కోట్ల ఒప్పందంతో ఏం సందేశం ఇస్తున్నట్లు..? అని నిలదీశారు. రాకేష్ రెడ్డి తండ్రి సుదీర్ఘకాలం కాంగ్రెస్లో పని చేసినందుకు మీరు ఆ కుటుంబానికి ఇచ్చిన బహుమానం ఇదేనా..? అని కేటీఆర్ అడిగారు.
తెలంగాణ పాలిట దండుపాళ్యం ముఠాలా మారిన సీఎం సోదరులు!!
న్యాయవాది భూములకే ఎసరు పెట్టిన సీఎం సోదరులు!! న్యాయం చేయాల్సిన ఖాకీలు సీఎం సోదరులతో సెటిల్ చేసుకోమంటారా?
రాష్ట్రంలో ఉన్నది పోలీసులా? రేవంత్ ప్రైవేట్ సైన్యమా? న్యాయవాదికే న్యాయం దక్కకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?
ఓ వైపు… pic.twitter.com/hAeGXPreNE
— KTR (@KTRBRS) October 26, 2024
ఇవి కూడా చదవండి..
BRS Party | కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్లో చేరిన హస్తం నేతలు
Telangana | బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై పోలీసు శాఖ సీరియస్.. శాఖాపరమైన చర్యలకు ఆదేశం!
Jeevan Reddy | నాకు చెప్పనేలేదు.. పార్టీ ఫిరాయింపులపై మరోసారి కాంగ్రెస్ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు