KTR | హైదరాబాద్ : కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల పట్ల పోలీసు ఉన్నతాధికారులు అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఏసీపీ, సీఐ స్థాయి అధికారులు.. ఆశా వర్కర్లను కొంగు పట్టి లాగి, తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా తమాషా చేస్తున్నారా..? మీ సంగతేంటో చూస్తామని ఆశా వర్కర్లను పోలీసు అధికారులు బెదిరింపులకు గురి చేశారు. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గ్రామ ప్రజలందరికీ మాతృమూర్తులుగా వ్యవహరిస్తున్న ఆశా వర్కర్లపై మగ పోలీసులతో దౌర్జన్యామా..? అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు.
తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం..? అని రేవంత్‌పై కేటీఆర్ మండిపడ్డారు. ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా..? ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారు..? దళిత, బహుజన ఆడబిడ్డలపై ఇంతటి అరాచకమా..? హోంమంత్రిగా ఉన్న మీకు ఆడవాళ్లంటే అంత చులకనా..? ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.
ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలుచేస్తున్నారంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మీ సర్కారు దాష్టీకానికి ఆశా నాయకురాలు సంతోషిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలి. ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే ఆశా వర్కర్ల ఆగ్రహజ్వాలను తట్టుకోలేరు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
సీఎం రేవంత్..
తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం ?
ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా ?
మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యమా ?ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారు ?
దళిత, బహుజన ఆడబిడ్డలపై ఇంతటి అరాచకమా ?హోంమంత్రిగా ఉన్న మీకు ఆడవాళ్లంటే అంత చులకనా ?… pic.twitter.com/eFUsWHNSPZ
— KTR (@KTRBRS) December 9, 2024
ఇవి కూడా చదవండి..
Group-2 Hall Tickets | గ్రూప్-2 హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో తప్పనిసరి.. నిబంధనలు ఇవే..!
Harish Rao | ఆశా వర్కర్లపై పోలీసుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీశ్‌రావు