కోల్‌కతా: ఐపీఎల్-19వ ఎడిషన్‌కు ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు గాయాల బెడద కలవరపెడుతున్నది. ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ పేసర్ హర్షిత్ రాణా ఈ సీజన్‌కు దూరమైనట్టు వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌నకు ముందు మోకాలిగాయంతో దూరమైన అతడు.. శస్త్రచికిత్స చేయించుకున్నా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని, రాబోయే ఐపీఎల్ సీజన్లో అతడు ఆడేది అనుమానమేనని కేకేఆర్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై కోల్‌కతా నుంచి అధికారిక ప్రకటనేమీ రాలేదు. ఇదిలాఉండగా వేలంలో ఆ జట్టు భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన మతీశ పతిరానా కూడా గాయంతో బాధపడుతున్నాడు. అతడు కూడా సీజన్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది అనుమానమే!