KTR | హైదరాబాద్ : అమృత్ టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆలస్యంగా స్పందిస్తూ.. బీఆర్ఎస్పై ఆరోపణలు చేశారు. దీంతో కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
బండి సంజయ్ వ్యవహారం దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉందని కేటీఆర్ విమర్శించారు. మీరు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అన్న విషయం మరిచిపోయినట్లు ఉన్నారని బండి సంజయ్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమృత్ మీ కేంద్ర ప్రభుత్వం పథకం. అందులో అవినీతి జరిగిందని ముందుగా చెప్పింది స్వయాన మీ పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయినా పాలు తాగుతున్న దొంగ పిల్లిలా కన్వీనియంట్‌గా కళ్ళు మూసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం ఆధారాలతో మేము బయట పెట్టాక ఈ చిల్లర మాటలు దేనికి..? సీవీసీ స్వతంత్ర సంస్థ…దానికి మీ సిఫార్సు దేనికి..? అయినా మీ అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ అందరూ గమనిస్తూనే ఉన్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
గౌరవనీయులైన బండి సంజయ్ గారు!
దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టు ఉంది ఈ వ్యవహారం! మీరు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అన్న విషయం మర్చి పోయినట్లు ఉన్నారు!
AmRUT మీ కేంద్ర పథకం. అందులో అవినీతి జరిగిందని ముందుగా చెప్పింది స్వయాన మీ పార్టీ MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. అయినా…— KTR (@KTRBRS) September 24, 2024
ఇవి కూడా చదవండి..
KTR | బాబు చిట్టి నాయుడు.. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేయలేరు.. రేవంత్‌కు కేటీఆర్ చురకలు
KTR | అనగనగా ఓ చిట్టి నాయుడు.. ఆయనకు ఏడుగురు అన్నదమ్ముళ్లు.. రేవంత్ కథ ఇదీ..!
KTR | రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే.. హైడ్రా బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలి : కేటీఆర్