KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అవమానపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
పచ్చకామెర్ల వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీరు బ్యాగులతో దొరికారని…అందరూ మీ లాగానే బ్లాక్మెయిల్ దందాలు చేస్తారని సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ బతుకుతున్నారని అనుకోవడం తప్పు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకలు అని కేటీఆర్ పేర్కొన్నారు.
సివిల్ సర్వెంట్స్ అంటే.. కార్యాచరణ రూపొందించడంలో నిష్ణాతులు.. కానీ ఏసీలో ఉండి యాక్షన్ చేసే వారు కాదు. సీఎం రేవంత్ రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అవమానించేలా మాట్లాడారు. ఆ మాటలు అమర్యాదగా ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు. అధికార వ్యవస్థ ప్రతిష్టను నాశనం చేసేందుకు సీఎం రేవంత్ నిరంతరం చేస్తున్న ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Telangana | మీ వైఫల్యానికి మాదా బాధ్యత?.. సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్ల గుస్సా!
Congress Leader | ముద్దులిస్తే బాకీ అడుగడట.. మహిళపై అధికార పార్టీ నేత అనుచిత ప్రవర్తన!
Osmania University | ఆర్ట్స్ కాలేజీలో నాలుగేండ్ల డిగ్రీ కోర్సు.. 100 ఏండ్ల చరిత్రలో మొదటిసారి