Osmania University | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో తొలిసారిగా నాలుగేండ్ల్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నది. ఇప్పటి వరకు క్యాంపస్‌లో పీజీ కోర్సులను మాత్రమే నిర్వహిస్తున్నారు. 1970కి ముందు తొలగించిన డిగ్రీ కోర్సులను ఆ తర్వాత పునరుద్ధరించడం ఇదే తొలిసారి. కొన్ని కాలేజీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
కానిప్పుడు కొత్తగా నాలుగేండ్ల డిగ్రీ కో ర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. తొలుత బీఏ తెలుగు కోర్సును ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశపెడతారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉ న్నత విద్యామండలి కార్యాలయంలో ఆర్ట్స్ కోర్సుల సిలబస్ రివిజన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత దశలవారీగా డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇది నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీకోర్సు కాగా ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఏడాదిలోపు పీజీ కోర్సును పూర్తిచేసుకోవచ్చు.
డిగ్రీ కోర్సుల సిలబస్‌లో మార్పులు చేయడంతో సివిల్స్‌ను సలభతరం చేయగలమన్న దిశలో అధికారులు బీఏ తెలుగు కోర్సుకు రూపకల్పనచేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సును ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.