Congress Leader | కేశంపేట, ఫిబ్రవరి 17: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో కాంగ్రెస్‌లోని ఓ కీలక నాయకుడిపై పోలీసులు కేసు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. కేశంపేట పోలీసుల కథనం ప్రకారం కేశంపేటలో ఓ ఉపాధ్యాయురాలు స్థానికంగా కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్‌రెడ్డికి చెందిన పాఠశాలను లీజుకు తీసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో ఆమె రెండేండ్లకే ఒప్పందం నుంచి వైదొలిగారు.
కానీ స్కూలుకు చెందిన కొన్ని మరమ్మతులను సదరు నాయకుడు చేయించాడు. ఇందుకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని మహిళకు తరచుగా ఫోన్ చేస్తున్నాడు. కానీ తాను ఇవ్వబోనని ఆమె తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో మహిళకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ముద్దులిస్తే డబ్బులు అడగనంటూ కాంగ్రెస్ నాయకుడు ఫోన్లో వ్యాఖ్యలు చేశాడని మహిళ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.