KTR | సీఎం మూర్ఖత్వం వల్ల అధికారులపై దాడులు.. రేవంత్ పాలనపై కేటీఆర్ ధ్వజం
KTR | రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం, శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ ఇవాళ రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్లో ఏకంగా జిల్లా కలెక్టర్ మీదనే రైతులు తిరగబడడం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం, శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ ఇవాళ రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్లో ఏకంగా జిల్లా కలెక్టర్ మీదనే రైతులు తిరగబడడం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరమని తెలిపారు.
నిజానికి రేవంత్ రెడ్డి దురాశ వల్ల, అవగాహనారాహిత్యం వల్లనే ఈ దుస్థితి దాపురించింది. భూసేకరణ పూర్తయ్యి, అన్ని అనుమతులు వచ్చి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని రద్దు చేసి, రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే తుగ్లక్ అలోచన వల్లనే ఇంత అలజడి రేగింది. ఫార్మా సిటీకోసం సేకరించిన భూములు అమ్ముకొని సొమ్ముచేసుకుందామన్న రేవంత్ కుత్సిత బుద్ధి వల్ల ఇప్పుడు ఇక్కడ ఫార్మా సిటీ భవితవ్యం ప్రమాదంలో పడింది, అక్కడ కొడంగల్లో అన్నదాతల భూములు గుంజుకునే కుట్ర మొదలైంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహం, చాలాచోట్ల కట్టలు తెంచుకుంటోంది. అది ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే భూస్థాపితం చేయనుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలు తిరగబడుతున్న పాలన.. కేటీఆర్ ట్వీట్
KTR | ఇప్పుడే ఢిల్లీలో కాలు పెట్టా.. అప్పుడే వణికితే ఎలా..? కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సెటైర్లు
Journalists | జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి షాక్.. ఐదేండ్ల తర్వాతనే ఇండ్ల స్థలాలు..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

