KTR | హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో ఫార్మా సిటీకి వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారులపై ప్రజలు తిరగబడ్డ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులపై రైతులు, మహిళలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజలు తిరగబడుతున్న పాలన.. ఏడాదిలోనే ఎదురీదుతున్న పాలన అని పేర్కొన్నారు. ఆంక్షలు పెట్టి.. ప్రజాకాంక్షలను తొక్కేస్తామంటే తెలంగాణ నేల ఊరుకోదు.. తిరగబడుతుంది.. తరిమికొడుతుంది.. తస్మాత్ జాగ్రత్త అని కేటీఆర్ హెచ్చరించారు.
ఫార్మా రైతులకు న్యాయం చేస్తామని కల్లిబొల్లి కబుర్లు చెప్పినోళ్లు.. సెక్యూరిటీ లేకుండా నీ సొంత జిల్లా దుద్యాల మండలంకు వచ్చే దమ్ముందా? అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. మీ మోసాలకు అధికారులను ఎందుకు బలిపశువులు చేస్తారు? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ..జై జై తెలంగాణ!! అని కేటీఆర్ తన ట్వీట్ చివర్లో రాసుకొచ్చారు.
ఇది ప్రజా పాలన కాదు
ప్రజలు తిరగబడుతున్న పాలన
ఏడాదిలోనే ఎదురీదుతున్న పాలనఆంక్షలు పెట్టి..
ప్రజాకాంక్షలను తొక్కేస్తామంటే
తెలంగాణ నేల ఊరుకోదు..
తిరగబడుతుంది.. తరిమికొడుతుంది
తస్మాత్ జాగ్రత్త!ఫార్మా రైతులకు న్యాయం చేస్తామని కల్లిబొల్లి కబుర్లు చెప్పినోళ్లు… pic.twitter.com/STeAWm002c
— KTR (@KTRBRS) November 11, 2024
ఇవి కూడా చదవండి..
KTR | నేను ఢిల్లీ చేరుకోగానే.. వణికితే ఎలా..? కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సెటైర్లు
Journalists | జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి షాక్.. ఐదేండ్ల తర్వాతనే ఇండ్ల స్థలాలు..!
TGSRTC | ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్‌లపై 10 శాతం రాయితీ