TGSRTC | హైదరాబాద్ : ఆర్టీసీ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ కలిగిన ప్రయాణికులు తమ వద్ద ఉన్న బస్‌పాస్‌లతో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌పై 10 శాతం రాయితీని పొందొచ్చని ఆర్టీసీ తెలిపింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ డిస్కౌంట్ వర్తించనుందని పేర్కొంది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్పోర్ట్ పుష్పక్ బస్ పాస్ కలిగిన ప్రయాణికులు ఈ రాయితీని పొందే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు 10 శాతం రాయితీ అమల్లో ఉండనుంది.
అయితే హైదరాబాద్ నగరంలో సుమారు 70 వేల వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాసులు ఉన్నాయి. ఈ బస్ పాసులు కలిగిన ఉన్నవారు వీకెండ్లో సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ పాసులు కలిగి ఉన్న వారి సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంస్థ అధికారిక వెబ్సైట్ లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని కూడా రాయితీ పొందొచ్చు. జనరల్ బస్‌పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
హైదరాబాద్ లోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ దారులకు శుభవార్త!! తమ దగ్గర ఉన్న బస్ పాస్ తో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్ లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ… pic.twitter.com/QINAoc8HlA
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) November 11, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | పచ్చని పంట పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్న రేవంత్ రెడ్డి : హరీశ్ రావు ఫైర్
AP Budget 2024-25 | భారీగా వ్యవసాయ బడ్జెట్.. కేటాయింపుల వివరాలివీ..!
Amit Shah: గిరిజన మహిళను పెళ్లి చేసుకుంటే.. భూ బదలాయింపు ఉండదు: కేంద్ర మంత్రి అమిత్ షా