AP Budget 2024-25 | ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో ప్రవేశపెట్టిన అనంతరం అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.43,402 కోట్లతో ఈ బడ్జెట్ను తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముకలాంటిదని తెలిపారు. 62 శాతం జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. కానీ గత ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. రైతు అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, రైతులకు ఆధునిక పనిముట్లు, రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తామని చెప్పారు. వడ్డీ లేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. అలాగే కౌలు రైతులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని ప్రకటించారు.
భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమిస్తున్నాం. భూసార పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తాం. పంటల సాగులో అధునాతన టెక్నాలజీపై రైతులకు ప్రోత్సాహం. విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు సబ్సిడీపై ఇస్తున్నాం. రిమోట్ సెన్సింగ్ విధానాన్ని ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడతాం.… pic.twitter.com/kGU7cRzv49
— Telugu Desam Party (@JaiTDP) November 11, 2024
వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు ఇలా..
అన్నదాత సుఖీభవ – రూ.4500 కోట్లు
రాయితీ విత్తనాలకు – రూ.240 కోట్లు
భూసార పరీక్షలకు – రూ.38.88 కోట్లు
విత్తనాల పంపిణీ – రూ.240కోట్లు
ఎరువుల సరఫరా – రూ.40 కోట్లు
పొలం పిలుస్తోంది – రూ. 11.31కోట్లు
ప్రకృతి వ్యవసాయం – రూ.422.96కోట్లు
డిజిటల్ వ్యవసాయం – రూ.44.77కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ – రూ.187.68కోట్లు
వడ్డీ లేని రుణాలకు – రూ.628కోట్లు
రైతు సేవా కేంద్రాలకు – రూ.26.92 కోట్లు
ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్స్ – రూ.44.03 కోట్లు
పంటల బీమా – రూ.1023కోట్లు
వ్యవసాయ శాఖ – రూ.8564.37కోట్లు
ఉద్యాన శాఖ – రూ.3469.47 కోట్లు
పట్టు పరిశ్రమ – రూ.108.4429కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్ – రూ.314.80 కోట్లు
సహకార శాఖ – రూ.308.26 కోట్లు
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం – రూ.507.038 కోట్లు
ఉద్యాన విశ్వవిద్యాలయం – రూ.102.227 కోట్లు
శ్రీ వేంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం – రూ.171.72 కోట్లు
మత్స్య విశ్వవిద్యాలయం – రూ.38కోట్లు
పశుసంవర్థక శాఖ – రూ.1095.71 కోట్లు
మత్స్య రంగ అభివృద్ధి – రూ.521.34 కోట్లు
ఉచిత వ్యవసాయ విద్యుత్ – రూ.7241.30 కోట్లు
ఉపాధి హామీ అనుసంధానం – రూ.5150కోట్లు
ఎన్టీఆర్ జలసిరి – రూ.50 కోట్లు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ – రూ.14,637 కోట్లు