KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ముఖ్యమంత్రిని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పును అని సీఎంను ప్రశ్నించారు కేటీఆర్.
పైసలతో దగదగమెరిసిన చేతుల్లోకి… పురుగుల మందుల డబ్బాలు రావడమే మార్పా? ఆదాయంతో నిండిన ఆనందమయ జీవితాల్లోకి.. ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా? రేవంత్…ఆటోడ్రైవర్లకు నువ్వు ఇస్తానన్న రూ. 12 వేల సాయమేది? రాహుల్ గాంధీ.. ఆటో వాలాలకు నీ ఆపన్నహస్తమేది? ఆటో డ్రైవర్లనే కాదు.. అన్ని వర్గాలను మోసగించారు! తెలంగాణను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు! ఇదే.. ఏడాది కాలంగా తెలంగాణ చూస్తున్న మార్పు! అని కేటీఆర్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | శాసనసభను ఇలా ఆలస్యంగా నడపడం కరెక్ట్ కాదు.. స్పీకర్‌కు హరీశ్‌రావు సూచన
SE Vijay Bhasker Reddy | ఇరిగేషన్లో పంచముఖుడు.. ముఖ్యమంత్రి ఆప్తమిత్రుడని అందలం!