Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన సహనటి రష్మిక మందన్నాను ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటవ్వడంతో అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.అయితే విజయ్‌కు ఉన్న భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మధ్య ఒక అభిమాని ఎమోషనల్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విజయ్–రష్మికల పెళ్లి ఫోటోను చూస్తూ ఓ యువతి భావోద్వేగానికి గురైంది. తనకు ఎంతో ఇష్టమైన హీరో పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. వీడియోలో ఆమె తన వద్ద దాచుకున్న విజయ్ ఫోటోలు, మ్యాగజైన్ కటింగ్స్, సినిమా పేపర్ కటింగ్స్‌ను చూపిస్తూ తన అభిమానం ఎంతగానో వివరించింది. విజయ్ సినిమాల పోస్టర్లు, పాత ఇంటర్వ్యూల క్లిప్పింగ్స్ అన్నింటిని సేకరించి ఉంచుకున్నానని చెప్పిన ఆ యువతి, “అతను సంతోషంగా ఉండాలి… కానీ నా ఫేవరెట్ హీరో పెళ్లి చేసుకున్నాడంటే కాస్త ఎమోషనల్‌గా ఉంది” అంటూ తన భావాలను వ్యక్తం చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, నెటిజన్ల నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు ఆమె అభిమానం నిజాయితీతో ఉందని అభినందిస్తుండగా, మరికొందరు ఇది సరదాగా తీసుకోవాల్సిన విషయమని కామెంట్లు చేస్తున్నారు. విజయ్–రష్మిక వివాహం తర్వాత “విరోష్” జంట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పెళ్లి ఫోటోలు, ఎయిర్పోర్ట్ వీడియోలు, సెలబ్రిటీల శుభాకాంక్షలు అన్ని ఈ స్టార్ కపుల్ పెళ్లిని టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మార్చేశాయి. ఇక ఈ లేడీ ఫ్యాన్ ఎమోషనల్ వీడియో కూడా ఆ ట్రెండ్‌కు మరో కొత్త కోణాన్ని జోడించింది. మార్చి 4న నూతన జంట హైదరాబాద్‌లో రిసెప్షన్ జరుపుకోనున్న విషయం తెలిసిందే.
😥😳😀
— Suresh PRO (@SureshPRO_) February 27, 2026