KTR | హైదరాబాద్ : ఈ ఏడాది కాలంలో రూ. లక్షా 40 వేల కోట్లు అప్పు చేసి ఏ పీకినవ్ రేవంత్ రెడ్డి..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఒక కొత్త ఇటుక పెట్టినవా, ఒక కొత్త పైప్ లైన్ వేసినావా, ఒక కాలువ తవ్వినవా, ఒక కార్మికుడికి లాభం తెచ్చవా, ఒక ఆడబిడ్డకు రూ.2500 ఇచ్చావా, తులం బంగారం ఇచ్చవా..? ఏం పీకినవ్ సంవత్సరంలో అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది.. హామీల అమలు కోసం నిలదీస్తే మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ అని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయారు అని చెబుతుండ్రు. ఈ తప్పుడు ప్రచారాన్ని, పనికిమాలిన వెధవ ప్రచారాన్ని తప్పికొట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వాళ్లు మాట్లాడే మాటలు పచ్చి బక్వాస్ మాటలు, బోగస్ మాటలు. ఎలా అంటే.. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనకు అప్పజెప్పారు. మన రాష్ట్రం మీద ఉన్న అప్పు ఆనాడురూ. 72 వేల కోట్లు. తలసరి ఆదాయం రూ. లక్షా 14 వేలు. రూ. 369 కోట్లు రెవెన్యూ మిగులు ఉండే. మనం దిగిపోయినాడు.. తలసరి ఆదాయం రూ. 3 లక్షల 56 వేలకు తీసుకుపోయిండు కేసీఆర్. రెవెన్యూ మిగులు రూ. 5,944 కోట్లతో కాంగ్రెస్కు అప్పజెప్పాం. కేసీఆర్ సంపదను పెంచిండు. పాతబాకీలు కట్టుకుంటూ.. అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ.. చేసిన అప్పు మొత్తం 4 లక్షల 17 వేల కోట్లు. ఇది అప్పు కాదు పెట్టుబడి. అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులను కట్టిండు.. కాళేశ్వరం, పాలమూర రంగారెడ్డి, సీతారామ, దామరచర్ల విద్యుత్ కేంద్రం, మెడికల్ కాలేజీలు, రైతు వేదికలు నిర్మించి సంపదను సృష్టించిండు. కేసీఆర్ మన భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టిండు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీలన్నీ అమలు చేస్తామని భట్టి విక్రమార్కతో పాటు అందరూ మాట్లాడారు. కానీ చేసిందేమీ లేదు. రిటైర్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు. డీఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీకి దిక్కు లేదు. ఎప్పుడైనా మనం ఆస్తులు, అప్పులు చూడాలి. ఒక్క ఏడాదిలో రేవంత్ రెడ్డి ఒక లక్షా 40 వేల కోట్ల అప్పు చేసిండు. కేసీఆరేమో ఏడాదికి రూ. 40 వేల కోట్లు అప్పు చేసి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిండు. కానీ రేవంత్ రెడ్డి చేసిన లక్షా 40 వేల కోట్ల అప్పుతో.. కొత్త ఇటుక పెట్టావా.. కాల్వ తవ్వినావా.. రైతుబంధు పెంచావా.. 2500 ఇచ్చావా.. తులం బంగారం ఇచ్చావా.. స్కూటీ ఇచ్చావా.. మరి ఏం పీకినవ్ వన్ ఇయర్లో.. మరి లక్షా 40 వేల కోట్లు ఎక్కడ పోయాయి రేవంత్ రెడ్డి..? కేసీఆర్ సాగునీరు తెచ్చిండు, మంచినీరు మంచిగా చేసిండు. రోడ్లు బాగు చేసిండు. సంక్షేమం చేసిండు. కార్మికులను కర్షకులను మంచిగా చూసుకుండు. ఒక్కటి మాత్రం రేవంత్ చేసిండు.. ఢిల్లీకి మూటలు మాత్రం జోరుగా మోసిండు.. వేల వేల కోట్లు పంపి కుర్చీని కాపాడుకుంటున్నాడు అని కేటీఆర్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
Nagarkurnool | మైలారం గ్రామంలో ఉద్రిక్తత.. ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్ : వీడియో
KTR | సఫాయి అన్న.. నీకు సలాం అన్న సీఎం ఈ దేశంలో ఎవరూ లేరు.. కేవలం కేసీఆర్ మాత్రమే : కేటీఆర్
KTR | కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు