నాగర్‌కర్నూల్ : ఎన్నికల్లో గెలిచాక ఆరు హామీలతో పాటు ఏడో హామీగా ప్రజాస్వామ్యానికి పాటుపడుతామని, ప్రజల నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. తీరా గెలిచాక అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నది. శాంతి యుతంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ కాంగ్రెస్ పార్టీ మార్క్ పరిపాలనను అమలు చేస్తున్నది. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం(Mylaram village) గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు పోలీసులను ఊరిలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారు. ముళ్ల కంపలు వేసి మహిళలు, గ్రామస్తులు నిరసన తెలిపారు.
పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఓ మహిళ సృహతప్పి పడిపోయింది. మైలారం గ్రామస్తులకు, రైతులకు మద్దతు తెలిపినందుకు ప్రొఫెసర్ హరగోపాల్ పలు సంఘాల నాయకు లతో కలిసి వెళ్లగా పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కాగా, మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వానికి, ప్రజలకు, ప్రతిపక్షాలకు వారధిలా ఉన్న హరగోపాల్(Professor Haragopal )వంటి వ్యక్తులను అరెస్ట్ చేయడాన్ని యావత్ ప్రజానీకం ఖండిస్తున్నది.
మైనింగ్ చేయొద్దంటూ పోలీసులను గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్న గ్రామస్తులు
మైలారం గ్రామస్తులకు, రైతులకు మద్దతు తెలిపినందుకు ప్రొఫెసర్ హరగోపాల్, పలు సంఘాల నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో ఉద్రిక్తత
పోలీసులు గ్రామంలోకి రాకుండా… https://t.co/a56Z2BP8kQ pic.twitter.com/gRLWp39YV0
— Telugu Scribe (@TeluguScribe) January 20, 2025