KTR | సఫాయి అన్న.. నీకు సలాం అన్న సీఎం ఈ దేశంలో ఎవరూ లేరు.. కేవలం కేసీఆర్ మాత్రమే : కేటీఆర్
KTR | ఈ రాష్ట్రంలో పని చేసే కార్మికుల అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు.
KTR | హైదరాబాద్ : ఈ రాష్ట్రంలో పని చేసే కార్మికుల అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. సఫాయి అన్న.. నీకు సలాం అన్న సీఎం ఈ దేశంలో ఎవరూ లేరు.. కేవలం కేసీఆర్ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
కేసీఆర్ హమాలీలు, ఆటో డ్రైవర్ల కోసమే కాదు.. అందరి కోసం పని చేశారు. కార్మికుల ఇబ్బందులు, చికాకులు పరిష్కరించేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారు. జీహెచ్ఎంసీలో సఫాయి కార్మికులకు మూడు సార్లు జీతాలు పెంచారు. తెలంగాణ ఏర్పడక ముందు నాటి ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వారిని పెద్ద మనసుతో ఆశీర్వదించింది. అంగన్వాడీల జీతం రూ. 4500 ఉంటే రూ. 13650కు పెంచారు. మినీ అంగన్వాడీలకు రూ. 2200 ఉంటే రూ.7800 చేశారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఆశా వర్కర్ల పట్ల పోలీసుల అసభ్యంగా ప్రవర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిరిగానే పోలీసులు కూడా ప్రవర్తించారు. ఆశావర్కర్లకు జీతాలు రూ. 2500 ఉంటే రూ. 9750 దాకా తీసుకువెళ్లాం. ఉపాధి హామీలో పని చేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా జీతాలు పెంచినం. అన్ని రంగాల్లో పని చేసే కార్మికులను గుండెల్లో పెట్టుకున్నామని కేటీఆర్ తెలిపారు.
హోంగార్డుల విషయం బాధాకరం. మొన్న ఒక హోంగార్డు కలిసి కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నడు. రూ. 9 వేలు ఉండే జీతాన్ని రూ. 25 వేలు చేసిండు కేసీఆర్.. ఆయన దేవుడు. ఎందుకు ఓడగొట్టారు. ఆయన ఉంటే మాకు ఇంకా లాభం జరిగేది. పోలీసులతో సమానంగా పే స్కేలు వచ్చేది.. మూడు పూటల అన్నం తింటున్నాం అంటే కేసీఆర్ పుణ్యమే అని ఆ హోంగార్డు చెప్పి బాధపడ్డాడని కేటీఆర్ గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 73 శాతం వేతనాలు పెంచారు. దేశంలో అత్యధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులే. ఇది చిన్న విషయం కాదు. కాంట్రాక్టర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేశాం. అలాగే నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చాం. 26 లక్షల మంది ప్రయివేటు డ్రైవర్లకు 5 లక్షల జీవిత బీమా ఇచ్చారు కేసీఆర్. వైద్య రంగం, మున్సిపల్ రంగంలో జీతాలు పెంచుకుంటూ పోయామని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Harish Rao | మహిళా కమిషన్‌కు సభ్యులకు జీతాలేవి..? రేవంత్, భట్టిని ప్రశ్నించిన హరీశ్‌రావు
KTR | కటింగ్‌లు, కటాఫ్‌లు మినహా.. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగిందేమిటి..? : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

