Harish Rao | మహిళా కమిషన్‌కు సభ్యులకు జీతాలేవి..? రేవంత్, భట్టిని ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్.. మహిళా కమిషన్‌కు ఎందుకు జీతాలివ్వడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.
Harish Rao | హైదరాబాద్ : ప్రతి నెలా మొదటి తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్న సీఎం, మంత్రుల మాటలు నేతి బీరకాయలో నెయ్యిచందంగా మారాయని అనేక సార్లు రుజువయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. మహిళల హక్కులను కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మహిళా కమిషన్ సభ్యులకు గత సంవత్సర కాలం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని తాజాగా నా దృష్టికి వచ్చింది అని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో మహిళా కమిషన్‌కు రూ. 2 కోట్ల 42 లక్షలు కేటాయించినప్పటికీ విడుదల చేసింది రూ. 20 లక్షలకు మించి లేదు. న్యాయమూర్తులతో సమానంగా వ్యవహరించబడే మహిళా కమిషన్ సభ్యులకే జీతాలు చెల్లించలేక పోతే ఈ ప్రభుత్వం సామాన్య మహిళల హక్కులను ఏ విధంగా కాపాడుతుంది..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
వెంటనే మహిళా కమిషన్ సభ్యుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, ఇక నుంచి మొదటి తారీఖునే మహిళా కమిషన్ సభ్యులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరుతున్నానని హరీశ్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | కటింగ్‌లు, కటాఫ్‌లు మినహా.. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగిందేమిటి..? : కేటీఆర్
Cold Wave | తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. సింగిల్ డిజిట్‌కే పరిమితం
Banana Price | ఒక్క అరటి పండుకు ‘వంద’.. విదేశీయుడికి షాకిచ్చిన హైదరాబాదీ..! Video
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

