Banana Price | అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి సరసమైన ధరకు లభిస్తాయి కూడా. రోడ్లపై ఎక్కడంటే అక్కడ అమ్ముతుంటారు. అరటి పండ్లను సాధారణంగా డజన్ లెక్కన విక్రయిస్తుంటారు. డజన్, అర డజన్ లెక్కన అరటి పండ్లను కొనుగోలు చేస్తుంటారు. డజన్ అరటి పండ్ల ధర రూ. 60 నుంచి రూ. 80 వరకు ఉంటుంది. బేరం చేస్తే ఒక పది రూపాయాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలా కొనుగోలు చేసి.. ఇలా ఆరగిస్తుంటారు.
అయితే హైదరాబాద్కు చెందిన ఓ అరటి పండ్ల వ్యాపారి మాత్రం ఒక్క అరటి పండును ఏకంగా రూ. 100 అమ్ముతున్నట్లు చెప్పాడు. అది కూడా స్థానికుడికి కాదు.. ఓ విదేశీయుడికి. మొజాంజాహీ మార్కెట్ నుంచి అఫ్జల్గంజ్ వైపు వస్తున్న ఓ విదేశీయుడికి అరటి పండ్ల బండి కనిపించింది. దీంతో అతను.. ఒక్క అరటి పండు ఎంత..? అని ఆ వ్యాపారిని అడగ్గా.. ఒక్కటి వంద రూపాయాలు చెప్పాడు. షాక్కు గురైన విదేశీయుడు.. పదేపదే ఎంత అని అడిగాడు. వందే అని మళ్లీ మళ్లీ చెప్పడంతో అతను షాక్కు గురయ్యాడు.
hello@hughabroad.com పేరుతో ట్రావెల్ వీడియోలు చేసే ఓ స్కాట్లాండ్ యువకుడికి ఈ వింత అనుభవం ఎదురైంది. ఆశ్చర్యపోయిన అతడు అంత ధర చెల్లించలేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వ్లాగ్ను తన ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఆ పోస్ట్ కాస్త వైరల్గా మారింది.
ఇవి కూడా చదవండి..
This Week Movies | ఈ వారం థియేటర్, ఓటీటీలో వచ్చే చిత్రాలివే.!
Donald Trump | మరోసారి ఐకానిక్ స్టెప్పులతో ఆకట్టుకున్న ట్రంప్.. వీడియో