Upcoming Telugu Movies | కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే 20 రోజులు అవుతుండగా.. ఈ సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలు ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తున్నాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మిక్స్డ్ టాక్‌తో ఈ ఏడాది ఫస్ట్ పరాజయాన్ని అందుకోగా డాకు మహరాజ్ అంటూ వచ్చి ఈ ఏడాది ఫస్ట్ సూపర్ హిట్ అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ చిత్రం అనంతరం వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా వచ్చి సూపర్ హిట్ అందుకోవడంతో పాటు రూ.160 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే సంక్రాంతి సందడి ముగియడంతో రిపబ్లిక్ డే సందర్భంగా పలు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఇక ఆ సినిమాలు ఏంటి అనేది చూసూకుంటే..
గాంధీ తాత చెట్టు
Gandhi Tatha Chettu | టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్, శ్రీమతి తబితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu). పద్మావతి మల్లాది ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, శేష సింధు రావులు నిర్మాతలు. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు.
ఐడెంటిటీ
మలయాళ నటుడు టోవినో థామస్(), త్రిష(), వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఐడెంటిటీ’ (Identity). ఈ సినిమాకు అఖిల్ పాల్, అనాస్‌ఖాన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే మలయాళంలో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు మేకర్స్. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ఈ చిత్రం ముందుకు రానుంది.
స్కై ఫోర్స్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’(Sky Force). ఈ సినిమాతో వీర్ పహరియా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుండగా.. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. భారత దేశ మొదటి వైమానిక దాడి ఆధారంగా ఈ సినిమా రూపొందగా.. ఇందులో సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్ కీలక పాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్ బ్యానర్లపై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మించాడు.
డియర్ కృష్ణ
ప్రేమలు సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి మమితా బైజు (Mamitha Baiju) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘డియర్ కృష్ణ’ (Dear Krishna). అక్షయ్ హీరోగా నటించగా.. ఐశ్వర్య లీడ్ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకు దినేష్ బాబు దర్శకత్వం వహించాడు. శ్రీకృష్ణుడికి.. ఆయన భక్తుడికి మధ్య చోటుచేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుండగా.. ఈ చిత్రం కూడా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హత్య
దివంగత నాయకుడు, మాజీ మంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి(Y.S Viveka Nanda reddy) మర్డర్ ఆధారంగా వస్తున్న తాజా చిత్రం హత్య. శ్రీవిద్య బసవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ధన్య బాలకృష్ణ రవి వర్మ, పూజా రామచంద్రన్, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగార్, రఘునాథ్ రాజు, శివాజీ రాజా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైఎస్ వివేకా రాజకీయ, కుటుంబ నేపథ్యం, ఆయన హత్యకు ముందు వెనుక జరిగిన పరిణామాలతో ఈ చిత్రం రాబోతుండగా.. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
హాంగ్‌కాంగ్ వారియర్స్
చైనాలో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీ ‘హాంగ్‌కాంగ్ వారియర్స్’ (Hongkong Warriors). మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది వేసవిలో విడుదలై అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఇదే చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 24న రిలీజ్ కానుంది.
ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే
అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల 2: ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది
జీ5
హిసాబ్ బరాబర్: జనవరి 24
నెట్‌ఫ్లిక్స్
యూ ఫైనల్ సీజన్ : జనవరి 24 (వెబ్‌సిరీస్)
ది నైట్ ఏజెంట్ సీజన్ 2 : జనవరి 23 (వెబ్‌సిరీస్)
ది సాండ్ క్యాసిల్ : జనవరి 24
ఈటీవీ విన్
వైఫ్ ఆఫ్: (జనవరి 23)