Donald Trump | మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ట్రంప్ విక్టరీ ర్యాలీ (Trump pre oath rally) నిర్వహించారు. వాషింగ్టన్ డీసీ (Washington DC)లో ఆదివారం నిర్వహించిన ఈ ర్యాలీలో ట్రంప్ మద్దతుదారులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో ట్రంప్ మరోసారి తన ఐకానిక్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ర్యాలీ ముగింపు సందర్భంగా విలేజ్ డిస్కో గ్రూప్ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది. స్టేజ్‌పై పాట పాడుతూ ఉర్రూతలూగించింది. అదే సమయంలో స్టేజ్‌పై ఉన్న ట్రంప్.. మ్యూజిక్కు తగ్గట్లుగా తన ఐకానిక్ స్టెప్పులతో మద్దతుదారులను ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
🎤 The original members of the Y.M.C.A. take the stage after Donald Trump’s speech, closing out the event with an unforgettable performance. 🎤 #ReformDaily #TrumpEvent #YMCA #MusicAndPolitics #News pic.twitter.com/cOvOTUfOnN
— The Reform Daily (@ReformDaily_) January 19, 2025
Also Read..
Donald Trump | అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. అక్రమ వలసలపై ట్రంప్ సంచలన ప్రకటన
Donald Trump | ట్రంప్ ప్రమాణం నేడే.. శ్వేతసౌధ పీఠంపై మరోసారి
Joe Biden | అమెరికా అధ్యక్షుడిగా చివరి రోజు.. జో బైడెన్ ఎక్కడ గడిపారంటే?