Elon Musk | మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ట్రంప్ విక్టరీ ర్యాలీ (Trump pre oath rally) నిర్వహించారు. వాషింగ్టన్ డీసీ (Washington DC)లో ఆదివారం నిర్వహించిన ఈ ర్యాలీలో ట్రంప్ మద్దతుదారులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఈ ర్యాలీలో బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) నాలుగేళ్ల కుమారుడు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
ర్యాలీలో భాగంగా స్టేజ్‌పై మస్క్ మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వెళ్లి సందడి చేశాడు. ఉత్సాహంగా గెంతులేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ర్యాలీలో భాగంగా మస్క్ మాట్లాడుతూ.. ‘డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గణనీయమైన మార్పులు తీసుకువచ్చేందుకు ఎదురుచూస్తున్నా. అమెరికాను మళ్లీ గొప్పగా మారుస్తాం’ అంటూ పేర్కొన్నారు.
Elon Musk’s son, little X, just followed him on stage at tonight’s Trump rally lol
“Sorry, little X just followed me on the stage here. He’s a very enthusiastic supporter.” pic.twitter.com/dp7xQEzyjz
— Sawyer Merritt (@SawyerMerritt) January 19, 2025
కాగా, ఇలా మస్క్ తన కుమారుడితో కలిసి కనిపించడం ఇదేమీ మొదటిసారి కాదు. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు తర్వాత జరిగిన విక్టరీ సెలబ్రేషన్స్‌లో కూడా నాలుగేళ్ల కుమారుడితో కలిసి మస్క్ హాజరయ్యారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో క్లబ్లో జరిగిన పార్టీలో ట్రంప్ ఫ్యామిలీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ 31 జరిగిన న్యూఇయర్ పార్టీలోనూ కుమారుడితో కలిసి మస్క్ హాజరయ్యారు.
Also Read..
Donald Trump | అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. అక్రమ వలసలపై ట్రంప్ సంచలన ప్రకటన
Donald Trump | ట్రంప్ ప్రమాణం నేడే.. శ్వేతసౌధ పీఠంపై మరోసారి
Joe Biden | అమెరికా అధ్యక్షుడిగా చివరి రోజు.. జో బైడెన్ ఎక్కడ గడిపారంటే?