Donald Trump | అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. అక్రమ వలసలపై ట్రంప్ సంచలన ప్రకటన
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపిస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ (MAGA) విక్టరీ ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.
వాషింగ్టన్: మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపిస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ (MAGA) విక్టరీ ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ర్యాలీకి చాలా మంది స్నేహితులు, మద్దతుదారులు, నిజమైన అమెరికన్ దైశభక్తులు హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు. మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నాం. రేపు మధ్యాహ్నం నాటికి నాలుగేండ్ల అమెరికా క్షీణతకు తెరబడపోతున్నది. అమెరికన్ బలం, శ్రేయస్సు, గౌరవం, గర్వంతో సరికొత్త రోజును ప్రారంభించబోతున్నాం.
తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన దేశంపై అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుంది. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తాం. ఇక మన సంపదను మనమే అనుభవిస్తాం. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలోనే భారీగా మొదలు పెడతాం.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం. టిక్‌టాక్ యాప్‌ను మళ్లీ తీసుకొచ్చాం. మన ఉద్యోగాలు చైనాకు పోవడానికి వీల్లేదు. అందుకే టిక్‌టాక్ యాప్‌లో అమెరికా ప్రభుత్వం 50 శాతం భాగస్వామ్యం తీసుకుంటుంది. మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తా. మూడో ప్రపంచ యుద్ధాన్ని నిలువరిస్తా. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా. మధ్య ప్రాశ్చంలో శాంతి నెలకొనేలా చేస్తా. అధికారం చేపట్టకముందే ట్రంప్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే కొన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇది నా ప్రభావం కాదు. మీ అందరి ఎఫెక్ట్ అన్నారు.
కాగా, టిక్‌టాక్‌ను తిరిగి ప్రారంభిస్తున్నామన్న ట్రంప్ ప్రకటనపై షార్ట్ వీడియో యాప్ కంపెనీ ధన్యవాదాలు తెలిపింది. బైడెన్ ప్రభుత్వ నిర్ణయంతో శనివారం నుంచి అమెరికాలో టిక్‌టాక్ యాప్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాను అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత టిక్‌టాక్ యాక్సెస్‌ను పునరుద్ధరిస్తామని ట్రంప్ ప్రకటించారు. విక్టరీ ర్యాలీలో ప్రసంగిస్తూ టిక్‌టాక్‌లో అమెరికా 50 శాతం భాగస్వామ్యం తీసుకుందని చెప్పారు. దీంతో తమకు భరోసా ఇచ్చినందుకు ఈ చైనా కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

