KTR | కటింగ్‌లు, కటాఫ్‌లు మినహా.. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగిందేమిటి..? : కేటీఆర్
KTR | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో.. అన్ని వర్గాల ప్రజలరు రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచారని కేటీఆర్ మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు కోతలు, కటాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వదిలేశారని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రుణమాఫీ, రైతు భరోసా, సాగునీళ్లు, కరెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మి రూ. 2500, ఆసరా పెన్షన్లు, రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, జాబ్ క్యాలెండర్, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీలు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ. 25 వేల పెన్షన్, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, రైతులకు రూ. 3 లక్షల వడ్డీ లేని రుణం, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా, నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం, ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు, 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ. 3 వేల పెన్షన్, రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం, కమిషన్, ఆర్టీసీ విలీన ప్రక్రియ, ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12 వేలు, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేలకు రేవంత్ రెడ్డి సర్కార్ కటింగ్ పెట్టిందని కేటీఆర్ తెలిపారు.
200 యూనిట్లు ఉచిత కరెంట్ కటాఫ్, రూ.500 గ్యాస్ సిలిండర్, రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేలు, ఆఖరుకు ఇందిరమ్మ ఇళ్లకు కటాఫ్, పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు కటాఫ్ ఎందుకు..? అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు కట్టించి ఎందుకు ఇవ్వరు..? డబుల్ బెడ్రూంలకు మూడు రంగులు వేసి మురిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ అని కేటీఆర్ విమర్శించారు. జాగో తెలంగాణ జాగో అని కేటీఆర్ నినదించారు.
కటింగులు, కటాఫ్ లు మినహా
ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమిటి ?రుణమాఫీ కటింగ్
రైతుభరోసా కటింగ్
సాగునీళ్లు కటింగ్
కరంటు కటింగ్
కేసీఆర్ కిట్ కటింగ్న్యూట్రిషన్ కిట్ కటింగ్
తులంబంగారం కటింగ్
మహాలక్ష్మి రూ.2500 కటింగ్
ఫించను రూ.4000 వేలు కటింగ్
రూ.5 లక్షల… pic.twitter.com/lw2oWggRKw
— KTR (@KTRBRS) January 20, 2025
ఇవి కూడా చదవండి..
Home Guards | కారుణ్యంపై కాఠిన్యం.. హోంగార్డుల నోట్లో మట్టికొట్టిన సీఎం రేవంత్
America | అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పులు
Kaloji Kalakshetram | కళతప్పిన కాళోజీ కళా క్షేత్రం.. ప్రారంభించి రెండు నెలలైనా తెరుచుకోని తలుపులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

