KTR | హైదరాబాద్ : రేవంత్ రెడ్డిపై ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయని చెప్పి.. తనపై కూడా ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేయించి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ కేసుల్లో వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజేసేందుకు తాను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం.. రేవంత రెడ్డి సిద్ధమా..? అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఈడీ విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ కేసు పెట్టారు. విచారణ సంస్థలను, అధికారులను గౌరవించి ఈ నెల 9న ఏసీబీ విచారణకు హాజరయ్యాను. 16న ఈడీ విచారణకు హాజరయ్యాను. రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు ఏడు గంటల పాటు అడిగారు. అన్ని వివరాలు తీసుకున్నారు. మీరు ఎన్ని సార్లు పిలిచినా వస్తాను. విచారణకు సహకరిస్తాను. రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా చెబుతున్నా.. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా.. పూర్తిగా విచారణకు సహకరిస్తాను. తన నిజాయితీని నిరూపించుకుంటానని చెప్పాను అని కేటీఆర్ తెలిపారు.
ఏసీబీ, ఈడీ వంటి విచారణ సంస్థలకు విచారించేందుకు రూ. 5 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుందని వార్తా పత్రికల్లో చూశాను. సీఎం రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్పలదచులకున్నా.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏసీబీ, ఈడీ కేసు తనపై పెట్టారు. నువ్వంటే దొరికినోడివి.. నేను నిజాయితీపరుడిని.. దైర్యంగా ఎదుర్కొంటాను. ప్రజాధనం వృథా చేయకుండా ఆ 10 కోట్లతో రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్లు ఇవ్వొచ్చు. నీకు నిజాయితీ, ధైర్యం ఉంటే.. ఏసీబీ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి అయినా.. ఎవరి ముందైనా సరే కూర్చుందాం.. మీరు మొత్తం మీడియాను లైవ్ పెట్టండి.. ఏ ప్రశ్న అడిగినా సరే సమాధానం చెబుతాను. మీపై నమోదైన ఏసీబీ, ఈడీ కేసుల్లో కూడా ప్రశ్నిద్దాం. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి.. అప్పుడు 50 లక్షల్లో ఒడిసిపోతది. భారీగా ఖర్చు పెట్టడం దేనికి..? విచారణ సంస్థల అధికారులు, మీడియా సంస్థల సమయం వృథా అయితోపోంది.. నీకు దైర్యం ఉంటే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అయినా.. న్యాయమూర్తుల ముందైనా, ఈడీ ఆఫీసులోనైనా కూర్చుందాం. నీకు ధైర్యం ఉంటే నీవే తేదీలు, సమయం ప్రకటించు.. నేను కూడా వస్తా. లై డిటెక్టర్ పరీక్ష పెట్టి ఎవరు ఏందో తేల్చుకుందాం అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
విచారణకు ఎన్నిసార్లైనా వస్తా.. ఎన్ని పరీక్షలు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. న్యాయ వ్యవ్థ మీద నమ్మకం ఉంది. న్యాయం గెలుస్తదనే విశ్వాసం ఉంది. తప్పు చేయలేదు.. అరపైసా అవినీతి జరగలేదు. తప్పు చేసి ఉంటే రుజువు చేయండి.. ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పానని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | ఇక ఢిల్లీని ఉద్ధరిస్తడట.. అసెంబ్లీ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి గప్పాలు..!
KTR | ఫార్ములా ఈ కార్ రేసు.. ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ
Himanshu Rao | తాత అడుగుజాడల్లో హిమాన్షు రావు.. వ్యవసాయ క్షేత్రంలో ఏం చేశాడో తెలుసా..?