BRS Party | హైదరాబాద్ : ఈ ఖరీఫ్‌కు రైతు భరోసా లేనట్టే.. రైతు భరోసాపై సబ్ కమిటీ వేశాం.. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎకరానికి రూ. 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులకు మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.
ఎద్దు ఏడ్చినా ఎవుసం, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును ఏడిపిస్తున్న కాంగ్రెస్‌కు అన్నదాతల ఉసురు తప్పదని అన్నారు. రైతు భరోసాకు డబ్బులు లేకపోవటంతోనే సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారని విమర్శించారు. కేసీఆర్ పదివేలు ముష్టి వేస్తున్నాడు.. మేము రూ. 15 వేలు ఇస్తామన్న సిపాయి ఎక్కడపోయాడని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఈ ఖరీఫ్‌కు రైతు భరోసా లేనట్టే..! కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం
KTR | రైతు భరోసా డబ్బులు ఇచ్చే దాకా వదిలేదే లేదు.. కాంగ్రెస్ సర్కార్‌కు కేటీఆర్ హెచ్చరిక