KTR : తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు రాష్ట్రంలో మద్యం ధరలు పెంచే అవకాశం ఉందంటూ ఇవాళ అన్ని పత్రికల్లో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న ధ్యాస మంచి పనుల మీద లేకపాయెనంటూ ఓ కవిత్వం రూపంలో ఆయన విమర్శలు చేశారు.
”మద్యంపై ఉన్న ధ్యాస – మద్దతు ధరపై లేకపాయే, మద్యంపై ఉన్న ధ్యాస – మంచి బోధనపై లేకపాయే, మద్యంపై ఉన్న ధ్యాస – మందుబిళ్లలపై లేకపాయే, మద్యం పై ఉన్న ధ్యాస – మూసి బాధితులపై లేకపాయే, మద్యంపై ఉన్న ధ్యాస – మంచినీళ్లపై లేకపాయే, మద్యంపై ఉన్న ధ్యాస – పింఛన్ పెంపుపై లేకపాయే, మద్యంపై ఉన్న ధ్యాస – భరోసా పెంపు పై లేకపాయే, 10 తగ్గిస్తే పగబట్టి 10 కి 10 కలిపి మరి పెంచుతాం అనబట్టే, నాడు అడ్డగోలు ఆరోపణలు నేడు అడ్డగోలు ధరల పెంపు, పెంచుకో – దంచుకో – పంచుకో.. నేడు మద్యం ధరల పెంపు.. రేపు రేపు ఏం పెంపో.. ఏన్నెన్ని పెంపో..” అని కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ పోస్టుకు ‘మద్యం ధరల పెంపు..!’ అనే శీర్షికతో ప్రచురితమైన ఓ వార్త క్లిప్పింగ్‌ను, #CongressLootsTelangana అనే హ్యాష్ ట్యాగ్‌ను కేటీఆర్ జతచేశారు.
మద్యంపై ఉన్న ధ్యాస – మద్దతు ధరపై లేకపాయే
మద్యంపై ఉన్న ధ్యాస – మంచి బోధనపై లేకపాయే
మద్యంపై ఉన్న ధ్యాస – మందుబిళ్లలపై లేకపాయే
మద్యం పై ఉన్న ధ్యాస – మూసి బాధితులపై లేకపాయే
మద్యంపై ఉన్న ధ్యాస – మంచినీళ్లపై లేకపాయే
మద్యంపై ఉన్న ధ్యాస – పింఛన్ పెంపు పై లేకపాయే
మద్యంపై ఉన్న ధ్యాస… pic.twitter.com/VaJZyLiISi
— KTR (@KTRBRS) October 19, 2024