Harish Rao | సిద్దిపేట : ఈ ఖరీఫ్‌కు రైతు భరోసా లేనట్టే.. రైతు భరోసాపై సబ్ కమిటీ వేశాం.. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా వేస్తామన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల.. చావు కబురు చల్లగా చెప్పారని హరీశ్‌రావు మండిపడ్డారు. రైతు భరోసా వేస్తామని చెప్పి.. మాట తప్పినందుకు క్షమాపణ చెప్పి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి. మేం అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరిట ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. రూ. 15 వేలు కాదు కానీ.. ఉన్న రూ. 10 వేలు ఇవ్వకుండా రైతులను మోసం చేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చెంపలు వేసుకుని, ముక్కు నేలకు రాసి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఇది రైతులను వంచిచండం కాదా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తప్పకుండా తిరగబడుతారు. ఇంత దుర్మార్గమా..? కరోనా సమయంలో, రాష్ట్రానికి ఆదాయం లేని సందర్భంలో కూడా రైతులకు రైతుబంధు ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు అన్ని బాగుండి కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వట్లేదు. రూ.లక్షా 50 వేలు కోట్లు మూసీకి ఉంటాయి, కానీ రైతులకు 15 వేలు ఇవ్వలేవా..? ఎందుకు రైతులంటే పగ.. ఎందుకు రైతులను ఇబ్బంది పెడుతున్నవ్. రుణమాఫీ విషయంలో మోసం చేసావు, బోనస్ విషయంలో మోసం చేసావు, ఇప్పుడు రైతు బంధు విషయంలో మోసం చేసావు. ఈ ప్రభుత్వాన్ని వదిలేదు. ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం రైతుబంధు 15 వేలు ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడిక్కడ నిలదీయాలని మేము ప్రజలకు పిలుపునిస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | రైతు భరోసా డబ్బులు ఇచ్చే దాకా వదిలేదే లేదు.. కాంగ్రెస్ సర్కార్‌కు కేటీఆర్ హెచ్చరిక
Harish Rao | జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం : హరీశ్‌రావు