Anil Kurmachalam | లండన్ : ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసు బనాయించిందని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటంబమే లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తుందని అనిల్ కూర్మాచలం మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి గొప్పగా పరిచయం చేసి హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్‌పై గౌరవం ఉండాల్సింది పోయి, నేడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు అండగా ఉంటూ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక, జవాబు చెప్పే దమ్ము లేక అక్రమ కేసు పెట్టి ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ తెలంగాణ బిడ్డ కేటీఆర్ వెంటే ఉన్నారని, యావత్ తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ది చెప్తారని అనిల్ తెలిపారు. కేటీఆర్‌పై పెట్టిన కేసును వెంటనే వాపస్ తీసుకోవాలని ఎన్నారైలంతా డిమాండ్ చేస్తున్నట్టు అనిల్ కూర్మాచలం తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Formula E Race | ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం
Harish Rao | అక్రమ కేసులకు భయపడం.. కోర్టుల మీద నమ్మకం ఉంది : హరీశ్‌రావు
Harish Rao | ఫార్ములా – ఈ రేస్‌పై రేవంత్ రెడ్డి చెప్పింది శుద్ధ అబద్ధం : హరీశ్‌రావు