BRS MLC | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్‌కు గురువారం మధ్యాహ్నం బయల్దేరారు. అయితే తన కారు బెంగళూరు హైవేపై వస్తుండగా షాద్‌నగర్ మిలినీయం టౌన్ షిప్ వద్ద సడెన్‌గా ఓ ద్విచక్ర వాహనం అడ్డుగా వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ కారు డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేయడంతో.. బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇక గాయపడిన వ్యక్తిని తన కారులోనే ఎమ్మెల్సీ నవీన్ సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఎమ్మెల్సీ ఆదేశించారు. ఈ ప్రమాదంలో నవీన్ కుమార్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Junior Lecturers | జూనియర్ లెక్చరర్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అభ్యర్థుల తుది జాబితా విడుదల
Harish Rao | ఇవి కూడా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో..! రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు సెటైర్లు
MLC Kavitha | అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా..? ఎమ్మెల్సీ కవిత ట్వీట్