MLC Kavitha | హైదరాబాద్ : అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. బీజేపీ, ప్రధాని మోదీపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు నుంచి విడుదల అయ్యాక తొలిసారి కవిత రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా..? అని కవిత ప్రశ్నించారు.
అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా అని ప్రశ్నించారు కవిత. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా అని కవిత ప్రధానిని ప్రశ్నించారు. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని సూటిగా ప్రశ్నించారు కవిత.
అఖండ భారతంలో
అదానికో న్యాయం…
ఆడబిడ్డకో న్యాయమా ?ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ?
ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ??
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 21, 2024
ఇవి కూడా చదవండి..
KTR | స్వరాష్ట్ర సాధనలో కీలక ఘట్టం దీక్షా దివాస్ : కేటీఆర్
Harish Rao | గుంట భూమి కబ్జా చేయలేదు దమ్ముంటే సర్వేకు రా.. సీఎంకు హరీశ్ రావు సవాల్
BRS Party | బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్