BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. వెయ్యి మంది రైతులతో ధర్నాకు అనుమతి లభించింది. అయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన రైతు ధర్నా వాస్తవానికి ఇవాళ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కానీ పోలీసులు అనుమతించలేదు. దీంతో గిరిజన రైతు ధర్నాకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.
ధర్నాకు అనుమతి ఇవ్వకపోగా.. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో అన్ని వీధుల్లో జిల్లా ఎస్పీ సుదీర్ రామనాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసుల బలగాలు కవాతు నిర్వహించాయి. ప్రజా పాలనలో కనీసం ధర్నా చేయడానికి కూడా అనుమతించని ప్రభుత్వ తీరుపై పౌర సమాజం భగ్గుమంటున్నది. ఇలాంటి ధోరణులు ప్రజాస్వామ్యానికి మంచివి కాదని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | మానుకోటలో ఏం జరుగుతుంది..? పోలీసుల కవాతుపై మండిపడ్డ కేటీఆర్
Harish Rao | గుంట భూమి కబ్జా చేయలేదు దమ్ముంటే సర్వేకు రా.. సీఎంకు హరీశ్ రావు సవాల్
Gadwala | మేం చెప్పినట్లే వడ్లు కొనాలి.. ధాన్యం కొనుగోలు సెంటర్లో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ