KTR | హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వేలాది మంది పోలీసులు కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేసేలా పోలీసులు లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
మహబూబాబాద్‌లో ఇప్పుడు ఎన్నికలే లేవు.. మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. అక్కడ గొడవలు ఏం జరగలేదు.. మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు..? అని ప్రశ్నించారు. అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది..? అని ఆయన అడిగారు.
శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది..? ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది..? ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్ష్యల పాలన, ఆంక్షల పాలన..
మొత్తంగా రాక్షస పాలన అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఖబర్దార్ రేవంత్.. ఇది తెలంగాణ. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
నేడు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిం చే గిరిజన రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇతర మండలాల నుంచి జిల్లా కేంద్రంలోకి ఎవరు రాకుండా పోలీసులు భారీ కేడ్లు పెట్టి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు-మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి?
అక్కడ గొడవలు ఏం జరగలేదు ?-మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు?
అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది ?
శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది ?
ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది… pic.twitter.com/nCrAPSi05v
— KTR (@KTRBRS) November 21, 2024
ఇవి కూడా చదవండి..
KTR | విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్.. మహిళలను కోటీశ్వరులను చేస్తాడట: కేటీఆర్
Mahabubabad | బీఆర్ఎస్ ధర్నా ఎఫెక్ట్.. పోలీసుల దిగ్బధంలో మహబూబాబాద్ : వీడియో
Harish Rao | గుంట భూమి కబ్జా చేయలేదు దమ్ముంటే సర్వేకు రా.. సీఎంకు హరీశ్ రావు సవాల్