KTR | విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్.. మహిళలను కోటీశ్వరులను చేస్తాడట: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్.. మహిళలను కోటీశ్వరులను చేస్తాడట అంటూ మండిపడ్డారు.
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్.. మహిళలను కోటీశ్వరులను చేస్తాడట అంటూ మండిపడ్డారు. రోజుకో గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేనిది గురుకుల పాఠశాల్లో ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు మరణించారని చెప్పారు. పిల్లలు పిట్టల్లా రాలుతుంటే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా వేదికల మీదికెక్కి పిట్టలదొర మాటలు చెబుతున్నాడని విమర్శించారు. తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట అని ఎద్దేవా చేశారు. దవాఖానల్లో విద్యార్థులు, చెరసాలలో రైతన్నలు, ఆందోళనలో నిరుద్యోగులు.. జాగో తెలంగాణ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట!
విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్-మహిళలను కోటీశ్వరులను చేస్తాడట!
రోజుకో గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి విద్యార్థుల అస్వస్థత
ఎన్నడూ లేనిది గురుకుల పాఠశాలలలో ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు… pic.twitter.com/7FkPe1TIPR
— KTR (@KTRBRS) November 21, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

