జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో(Congress) ఆదిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా గద్వాల మండలం బీరెల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరిత తిరుపతయ్య అనుచరులు ఘర్షణకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రం(Grain purchasing center) మా ఆధ్వర్యంలో నడవాలి.. మేం చెప్పినట్టే వినాలి అంటూ ఇరువర్గాలు గొడవకు దిగాయి. రాజకీయ కారణంగానే బీరెల్లి గ్రామ కొనుగోలు సెంటర్ను ఈ సంవత్సరం వేరే మహిళా గ్రూపులకు ఇచ్చారాని గత సంవత్సరం నిర్వహించిన మహిళా సంఘాల గ్రూప్ వారు ఆరోపిస్తున్నారు. గద్వాల నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవ పడుతుండటంతో గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది.