Akkineni Nagarjuna | మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున (Akkineni Nagarjuna) నాంపల్లి కోర్టు (Nampally Court)లో పరువు నష్టం దావా (Defamation Case) వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో నాగార్జున పిటిషన్‌కు కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ ఇవాళ కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసిన విషయం తెలిసిందే. నాగార్జునతో పాటు మిగతా సాక్షుల స్టేట్మెంట్లను కూడా నమోదు చేసింది.
అసలు ఏం జరిగిందంటే..
అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నటి సమంతతో పాటు, అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దూమారం రేపుతున్నాయి.
అయితే కొండా చేసిన వ్యాఖ్యలకు గాను హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తమ కుంటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
Also Read..
Kasthuri | తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరికి ఊరట
KTR | విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్.. మహిళలను కోటీశ్వరులను చేస్తాడట: కేటీఆర్